potato halva
కావలసినవి
బంగాళాదుంపలు - 4
పంచదార - 100గ్రా
యాలకులు - 4
పాలకోవా - ఒక
కప్పు
నెయ్యి - 100గ్రా.
పచ్చకర్పూరం - కొద్దిగా
తయారుచేసే
విధానం
బంగాళాదుంపలు
కడిగి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిన తరువాత తొక్కలు వొలిచి
మెత్తగా రుబ్బాలి. ఈ రుబ్బిన ముద్దను ఒక గరిటె నెయ్యి వేసి వేయించుకోవాలి.
పాలకోవాను ముందుగా తయారుచేసుకోవాలి. వేయించిన దుంపల ముద్దలో పాలకోవా వేసి కలిపి
ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పంచదార వేసి, నీళ్లు కొద్దిగా పోసి తీగపాకం వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి, తరువాత రెండూ కలిపి
ఉంచుకున్న ముద్దను ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా
వేసి బాగా కలిపి, యాలకుల
పొడి, పచ్చకర్పూరం
కూడా వేసి బాగా కలపాలి. మూత ఉంచి అరగంట తరువాత తియ్యాలి. ఇది చాలా బాగుంటుంది.
వెరైటీగా కూడా ఉంటుంది

COMMENTS